చూసా చీకటి ఇలా కాదు
చలి తో వణికేలే హృదయం
గతమే ఇక ముగుసేనా బ్రతికేదెలా
లొంగిపోనా, నిశీధి నీడకే
నే నీతో వస్తుంటా ఎల్లప్పుడు
రాలేని దారిలో నువ్వున్నావా
శోకం ఏదో బలంతో నను లాగేనా
మరి ఏదో మాట వినిపించుతోంది...
ఓడావు, పడ్డావు
ఏమైనా సాగు
సరైన అడుగేసి
వేకువయ్యేవా ఈ చీకట్లో
ఇదంతా నిజంగా తెలీదే
ఎటెళ్తే ఏమౌతుందో నేనొంటరి
నను నడిపించేటీ తారే నీవేగా
ఆ నింగే తాకాలి
నువ్వే లేక లేదే దారీ
అన్నీ సరే చేయ
అడుగే వేయనా
ఇక లేదులే ఏ వీలు సరే చేస్తా
నా శక్తి సరిపోదులే
ఇక నావల్ల కాదులే
నే భరిస్తా ఎదురిస్తా
నే వస్తా నే చేస్తా
దాటేస్తా ఓటమే!
పడిలేస్తూ వస్తున్నా
చీకటిలోంచి నేరుగా
సరైన అడుగేస్తా
ఈ పొద్దులో ఏముందో
అటుపై ఈ జీవితాలే ముందులానే మారేనా ?
నినే వెంటాడే స్వరం మాటే వింటూ సరే చేస్తా