మీరా చిత్తచోరా
మీరా చిత్తచోరా...
రంగరంగేళి వేళ నాలో రాగమైన రంగు నువ్వేరా...
మీరా చిత్తచోరా దాచలేని సిగ్గెరుపై...
నీవే కలా...
రేయికాని మిన్నెరుపై ఎన్నాళ్ళిలా...
కాగుతోంది మది కాంచన శిల వేళమించక ఇలాగ రారా...
మీరా చిత్తచోరా...
రంగ రంగేళి...
యేళ నాలో రాగమైన రంగు నువ్వేరా...
మీరా చిత్త చోరా.
ప్రియంగా సరాగమాడి సరాగమాడి హా.
వెన్నాడి హా...
ప్రియంగా సరాగమాడి...
జంట జతులాడి అంతలోనే కలైనావే వనితా వీహారి.
ఇలా చేరి చేజారి ఉడికించనేల.
మురారీ అల్లరి చాలు మురిపించలేవా.
పచ్చవెన్నెలంటి పరువమెంత కందినా.
నన్నందవేరా...
మీరా చిత్తచోరా.
రంగ రంగేళి...
వేళ ...
నాలో రాగమైన రంగు నువ్వేరా...
నాలో రంగు నీవే.
మీరా చిత్తచోరా...
రాజు వేమన