పల్లవి:
ప్రతీక్షణం నువు నవ్వుతుండిది చిన్ని జీవితం..
వెలుగు నీడలలుముకున్న రంగు జీవితం..
మది మాటనే వింటూ ఉండూ...
రేపన్నదే ఉందో లేదో...
ప్రతీక్షణం నువు నవ్వుతుండిది చిన్ని జీవితం..
వెలుగు నీడలలుముకున్న రంగు జీవితం..
మది మాటనే వింటూ ఉండూ...
రేపన్నదే ఉందో లేదో...
చరణం1:
నీ మనసెరిగినా ఆ మనసే దొరకడమంటే సమస్యే...
ఆ మనసే ఎదురైతే నీ జీవితం సుఖమేలే..
ఆ తోడునీ నువు వీడకు...
మరుజన్మమే ఉందో లేదో..
మది మాటనే వింటూ ఉండూ...
రేపన్నదే ఉందో లేదో...2
చరణం2:
ఓ...ఓ..ఓ....
నీ కంట నీరు తుడిచేటి ఆ చేయి నీ చెంత చేరే...
బాధలే ఐనా వేదనలైనా మరిచేవు ఒడిన వాలి.
ఓ విషయమే గుర్తుంచుకో...
మరుజన్మమే ఉందో లేదో..
ప్రతీక్షణం నువు నవ్వుతుండిది చిన్ని జీవితం..
వెలుగు నీడలలుముకున్న రంగు జీవితం..
మది మాటనే వింటూ ఉండూ...
రేపన్నదే ఉందో లేదో...
మది మాటనే వింటూ ఉండూ...
రేపన్నదే ఉందో లేదో...