వినబడినా వినను
ఏ కలకలం కోరనులే
పిలిచే పిలుపేది నను కదపదు లే
పరుగే తీసేస్తూ మరి రాను వెనకే
నీ స్వరమే. పెట్టానులే పెడచెవినే
కాదని విన్నా అది జరగదు ఏ భయమూ లేదు
నన్ను కోరే మనుషులంతా ఇచటే గలరు
రహస్యమంటు చెప్పినా నే పలకనుగా
చేశా సాహసాలు ఇంకేదీ వద్దులే
నష్టమెంత జరగనుందో నేను పడనులే
నీ మాయ వల్లో నీ మాయ వల్లో
నీ మాయ వల్లో
దేనికిలా ? నిదురలు చెరుపునది
పొరబాటు చేసానా నమ్మి ఇటు కదిలి ?
లేదంటే నువ్వు, కొంచెం నాలా ఉంటావా ?
నాదే కాదా ? నివసించే ఈ చోటే
దిగులే మొదలయ్యే నా శక్తే పెరిగే
వేరే దారి చూడలేక చేరానా
నీ మాయ వల్లో నీ మాయ వల్లో
నీ మాయ వల్లో
నువ్వున్నావా ? చూస్తున్నావా ?
నిన్ను చేరా వింటున్నావా ?
ఎటు వెళ్తున్నావు ? నన్నే వదిలేసి
నేనెల్లా పడ్డానో నీ మాయ వల్లో