అదేంటో గాని ఉన్నపాటుగా
అమ్మాయి ముక్కు మీద నేరుగా
తరాలనాటి కోపమంతా
ఎరుపేగా
నాకంటూ ఒక్కరైనా లేరుగా
నన్నంటుకున్న తారావే నువ్వా
నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా
తేరి పార చూడ సాగే దూరమే
ఏది ఏది చేరే చోటనే
సాగే క్షణములాగేనే
వెనకే మనని చూసేనె
చెలిమి చేయమంటు కోరెనే
వేగమడిగి చూసెనే
అలుపే మనకి లేదనే
వెలుగులైన వెలిసిపోయెనే
మా జోడు కాగా
వేడుకేగా వేకువేప్పుడో తెలీదుగా
ఆ చందమామ
మబ్బులో దాగిపోదా
ఏ వేళ పాళ మీకు లేదా
అంటూ వద్దనే అంటున్నదా
ఆ సిగ్గులోన అర్థమే మారిపోదా
ఏరి కోరి చేర సాగే కౌగిలే
ఏది ఏది చేరె చోటనే
కౌగిలిరుకు ఆయనే
తగిలే పసిడి ప్రాణమే
కనులలోనే నవ్వు పూసెనే
లోకమిచట ఆగెనే
ముగ్గురో ప్రపంచమాయెనే
మెరుపు మురుపుతోనే కలిసెనే
అదేంటో గాని ఉన్నపాటుగా
కాలమెటుల మారెనే
దొరికే వరకు ఆగదే
ఒకరు ఒకరు గానే విడిచెనే
అదేంటో గాని ఉన్నపాటుగా
దూరమెటుల దూరెనే
మనకే తెలిసె లోపలే
సమయమే మారిపోయెనే